అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rain Alert | తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో కుండపోత వాన కురుస్తుందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
రాష్ట్రాన్ని వర్షాలు వీడటం లేదు. బంగళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన (LPA) ప్రభావంతో గత వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. మంగళవారం సైతం భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) పడే అవకాశం ఉంది.
Rain Alert | సాయంత్రం తర్వాత..
రాష్ట్రంలోని మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయి. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు వరుణుడు తన ప్రతాపం చూపనున్నాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ బాగానే కాస్తుంది. మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉంది.
Rain Alert | హైదరాబాద్ నగరంలో..
హైదరాబాద్ (Hyderabad)లో మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. సోమవారం సైతం నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. కూకట్పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి, మాధాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, పటాన్చెరు, మెహదిపట్నం ఏరియాల్లో వర్షం పడింది. కూకట్‌పల్లిలో 37.8 మి.మీ. వర్షం కురిసింది. దీంతో రోడ్లు జలమయం అయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
Rain Alert | వర్షపాతం వివరాలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం పడింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు అత్యధికంగా మెదక్ (Medak) జిల్లా రేగోడ్‌లో 125 మి.మీ. వర్షం కురిసింది. పాపన్నపేట మండలం మిన్పూర్లో 108, కొల్చారంలో 102, మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో 98.8, సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో 95.8, సిద్దిపేట జిల్లా తుక్కాపూర్‌లో 89 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.