అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rain | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షాలు heavy rains కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ Meteorological Department హెచ్చరించింది. ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉంది. చల్లని గాలులు వీచాయి. పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం వర్షం పడింది. రాత్రి రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, కామారెడ్డి, మెదక్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం thunder storms కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. నాగర్ కర్నూల్, సూర్యాపేట, నల్గొండలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వాన పడొచ్చని తెలిపారు. హైదరాబాద్‌లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.
