అక్షర టుడే, ఎల్లారెడ్డి: Yellareddy | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై (Supreme Court Chief Justice BR Gavai) దాడిని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నవంబర్ 1న చేపట్టనున్న ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి (Chalo Hyderabad program) తరలిరావాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు కంతి పద్మారావు మాదిగ పిలుపునిచ్చారు.
పట్టణంలో గురువారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సీజేఏపై దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో బషీర్‌బాగ్ (Basheer Bagh) నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రెటేరియట్ వరకు భారీ ర్యాలీ ఉంటుందన్నారు. ఈ ర్యాలీకి ప్రతి మండలం నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు, మాదిగలు హాజరు కావాలని కోరారు. మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎల్లారెడ్డి మండల అధ్యక్షుడు రామగుండం శివానందం, ఉపాధ్యక్షుడు మానేయ, సీనియర్ నాయకులు సామేలు, పరువయ్య, ఆగమయ్య, కాశయ్య, సంగయ్య, సాయి తదితరులు పాల్గొన్నారు.

