అక్షరటుడే, ఇందూరు: TGEJAC | తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (Telangana Employees JAC) ఆధ్వర్యంలో ‘ఛలో హైదరాబాద్’ (Chalo hyderabad) నిర్వహిస్తున్నట్లు జేఏసీ ఛైర్మన్ జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు.
హైదరాబాద్లోని టీఎన్జీవో భవన్లో మంగళవారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 12న చలో హైదరాబాద్ (Hyderabad) నిర్వహిస్తున్నట్లు వివరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లుల్లో మంజూరు, పీఆర్సీ (PRC) అమలు, పెండింగ్ డీఏల (DA) మంజూరు, ఉద్యోగుల ఆరోగ్య పథకం, సీపీఎస్ (CPS) విధానం రద్దు తదితర 63 డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందించామన్నారు.
ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 8న వరంగల్ (Warangal), 9న కరీంనగర్ (karimnagar), 10న ఆదిలాబాద్, 11న నిజామాబాద్, 12న సంగారెడ్డి, 15న వికారాబాద్, రంగారెడ్డి, 16 మహబూబ్నగర్, 17న నల్లగొండ, 18న ఖమ్మం నుంచి మిగతా జిల్లాల్లో బస్సుయాత్ర ఉంటుందన్నారు.
సమావేశంలో టీఎన్జీవోస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నీతి కుంట శేఖర్, జాయింట్ సెక్రెటరీ జాఫర్ హుస్సేన్, ఆర్మూర్ యూనిట్ అధ్యక్షుడు శశికాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
