TUCI
TUCI | 31న టీయూసీఐ ఆధ్వర్యంలో 'చలో కలెక్టరేట్'

అక్షరటుడే, బోధన్: TUCI | టీయూసీఐ ఆధ్వర్యంలో ఈనెల 31న ‘చలో కలెక్టరేట్​’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర నాయకులు మల్లేష్​ తెలిపారు. ఈ మేరకు సోమవారం కరపత్రాలను విడుదల చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. బోధన్ పట్టణంలోని (Bodhan Town) మున్సిపాలిటీలో పనిచేసే ఎన్​ఎంఆర్(NMR)​, కాంట్రాక్ట్​, అవుట్​సోర్సింగ్​ కార్మికుల (Outsourcing workers) సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. వీరందరిని తక్షణమే పర్మినెంట్​ చేయాలని.. 72 రంగాల కార్మికుల సమ్యల పరిష్కారం కోసం ఈనెల 31న ‘చలో కలెక్టరేట్’​ నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

కాంట్రాక్ట్​, అవుట్​సోర్సింగ్​ కార్మికులకు రూ. 26 వేల వేతనం ఇవ్వాలని, ఈపీఎఫ్​ పెన్షన్​ రూ. 9వేలకు పెంచి ఇవ్వాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు జె.అక్కయ్య, పట్టణ నాయకులు జ్ఞానేశ్వర్, నారాయణ, సురేష్, మహేశ్​, దత్తు, రవి తదితరులు పాల్గొన్నారు.