అక్షరటుడే, వెబ్‌డెస్క్: Challans | ట్రాఫిక్ traffic సమస్యలను నియంత్రించేందుకు, వాహనదారుల క్షేమం దృష్ట్యా ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనల (traffic Rules) ను కఠినతరం చేసింది. వాటిని పోలీసులైతే సాధ్యమైనంత వరకు పక్కాగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నారు.
కాగా.. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు నియంత్రించేందుకు ప్రభుత్వం, పోలీసు శాఖ police department ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కొందరు వాహనదారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ ను అసలు పాటించడం లేదు.
ఇక ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులు మన మధ్య ఎందరో ఉన్నారు. దొరికినవాడు దొంగ..దొరకని వాడు దొర అన్నట్లు ఉంటుందనుకోండి ఇలాంటి వ్యవహారం. ఒక విషయానికి వస్తే.. కరీంనగర్‌కు చెందిన ఓ వాహనదారుడు భారీగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ పోలీసుల కెమెరాకు చిక్కాడు. ఇలా ఎన్నిసార్లు అంటే ఎవరూ కనీవిని ఎరుగనంత.
Challans | ఆరేళ్ల పాటు..
కరీంనగర్ Karimnagar జిల్లా పాసింగ్ ఉన్న TS 02 EX 1395 నంబరు గల ద్విచక్ర వాహనంపై ఏకంగా 277 చలాన్లు ఉన్నాయి. ఈ వాహనం అబ్దుల్ ఖయ్యూం పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంది. ఈ వాహనంపై జూన్ 2019లో మొదలైన చలాన్ల దండయాత్ర గతేడాది డిసెంబరు వరకు కొనసాగింది.
ఇక ఈ వాహనం (vehicle) పై వేయబడ్డ చలాన్ల జరిమానా మొత్తం రూ.79,875 కావడం గమనార్హం. ఇందులో కేవలం ఛార్జెస్ విలువనే (అంటే ఒక్కో చలాన్‌కు ఛార్జి రూపంలో వసూలు చేసే రూ.35) రూ.9,275 ఉందంటే.. ఎంత భారీ మొత్తంలో జరిమానాలు పడ్డాయో అర్థం చేసుకోవచ్చు.
పాత బడిన వాహనం విలువ కంటే జరిమానా విలువ ఎక్కవ ఉన్నందున.. మరి వాహన యజమాని జరిమానా కడతారా..? లేక వాహనాన్నే వదిలేసుకుంటారా..? ఇక పోలీసులు ఎలాంటి చర్యలు action తీసుకుంటారో వేచి చూడాల్సిందే..