HomeతెలంగాణTraffic Rules | ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం.. చలాన్లు చెల్లించకపోతే లైసెన్స్ రద్దు, వాహనం...

Traffic Rules | ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం.. చలాన్లు చెల్లించకపోతే లైసెన్స్ రద్దు, వాహనం స్వాధీనం

Traffic Rules | కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ కఠిన నిబంధనలపై ప్రయాణం మరింత సురక్షితంగా మారేందుకు దోహదపడతాయని, అలాగే వాహనదారులు కూడా నియమాలను గౌరవించాలని అధికారుల సూచన. ఇకపై సరదాగా డ్రైవ్ చేయాలంటే, సురక్షిత డ్రైవింగ్‌తో పాటు చలాన్లు కూడా టైమ్‌లో చెల్లించాల్సిందే

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Traffic Rules | దేశంలోని వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం(Central Government) కీలక హెచ్చరిక జారీ చేసింది. రోడ్డు భద్రతను పెంచడం, ట్రాఫిక్ నియమాల పాటింపును బలపరిచేందుకు కేంద్ర రవాణా శాఖ కొత్త ట్రాఫిక్ రూల్స్(Traffic Rules) విడుదల చేసింది. ఇందులో నిబంధనలు మరింత కఠినతరంగా ఉండటం గమనార్హం.

కొత్త నిబంధనల ప్రకారం, ఒక వాహనంపై ఐదు లేదా అంతకంటే ఎక్కువ ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లయితే, సంబంధిత రవాణా అధికారులు ఆ వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్‌(Driving License)ను రద్దు చేసే అధికారం పొందనున్నారు. ఇకపై నియమాలు ఉల్లంఘిస్తే సరిపోదు వాటికి భారీ పరిణామాలూ ఎదురవుతాయి.

Traffic Rules | చలాన్ చెల్లించేందుకు గడువు కటింగ్

ఇప్పటి వరకు ట్రాఫిక్ చలాన్(Traffic Challan) చెల్లించేందుకు ఉన్న 90 రోజుల గడువును 45 రోజులకు కుదించారు. అంటే, చలాన్ జారీ అయిన 45 రోజుల్లోగా చెల్లించకపోతే, పోలీసులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పొందనున్నారు. ఈ నిబంధన వాహనదారులను మరింత శ్రద్ధగా ఉండేలా చేస్తుందని అధికారులు అంటున్నారు. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేస్తే, 3 రోజుల్లోపుగా ఎలక్ట్రానిక్ చలాన్(Electronic Challan) జారీ చేస్తారు. ఈ చలాన్‌ వాహన యజమాని పేరుపై జారీ అవుతుంది. కానీ, చలాన్ జారీ సమయంలో వాహనాన్ని యజమాని కాకుండా ఇంకెవరైనా నడిపినట్టు స్పష్టమైన ఆధారాలతో రుజువు చేస్తే, ఆ వ్యక్తినే బాధ్యుడిగా పరిగణిస్తారు.

ఈ కొత్త ముసాయిదా నిబంధనలపై ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాలు స్వీకరించేందుకు కేంద్రం ఓ ఈమెయిల్ ఐడీను అందుబాటులో ఉంచింది. comments-morth@gov.in కు ఈ-మెయిల్ Mail ద్వారా పంపవచ్చని స్పష్టం చేసింది. అదనపు వివరాలకు దిల్లీ రహదారి రవాణా మంత్రిత్వ శాఖలోని అదనపు కార్యదర్శిని కూడా సంప్రదించవచ్చు. ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో అధిక రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణంగా అతివేగం ఉన్నట్టు గుర్తించారు. స్పీడ్ లిమిట్ స్పష్టంగా నిర్దేశించినా కూడా చాలామంది డ్రైవర్స్ అవి పాటించడంలేదు. 2024లో ఒక్క తెలంగాణలోనే 11.31 లక్షల ఓవర్ స్పీడ్ కేసులు నమోదవ్వడం గమనార్హం. 25,971 మంది రోడ్డు ప్రమాదాల్లో బాధితులయ్యారు.