ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Chakali Ailamma | చాకలి ఐలమ్మ స్పూర్తి అందరికీ ఆదర్శం

    Chakali Ailamma | చాకలి ఐలమ్మ స్పూర్తి అందరికీ ఆదర్శం

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Chakali Ailamma | తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాటస్ఫూర్తి అందరికీ ఆదర్శం అని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) అన్నారు.

    చాకలి ఐలమ్మ వర్ధంతిని (Chakali Ailamma vardhanthi) పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.

    వినాయక్ నగర్​లోని (Vinayak nagar) ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్, అదనపు కలెక్టర్ అంకిత్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకమైన పోరాటం చేశారని గుర్తు చేశారు.

    తన హక్కుల కోసం పోరాడిన సాహస వీరనారి ఐలమ్మ అని కొనియాడారు. చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని, ఆమె ఆశయాల సాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి నర్సయ్య, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

    More like this

    Nizamabad KFC | కేఎఫ్సీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad KFC | రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని వేణుమాల్(Venu Mall)లో గల కేఎఫ్సీ...

    Stock Markets | ఐటీలో కొనసాగిన జోరు.. లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Stock Markets | భారత్‌, యూఎస్‌ల మధ్య ట్రేడ్‌ డీల్‌(Trade deal) వైపు అడుగులు...

    Kamareddy | సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...