- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిChakali Ailamma | ఉమ్మడిజిల్లాలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

Chakali Ailamma | ఉమ్మడిజిల్లాలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Chakali Ailamma | చాకలి ఐలమ్మ అందరికీ ఆదర్శమని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని వినాయక్ నగర్​లోని విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనలో దొరలు, భూస్వాములు, బడుగు బలహీనవర్గాల ప్రజల కోసం పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అన్నారు. ఆమె నేటి మహిళ లోకానికి స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం రిజర్వేషన్ బిల్ తెచ్చి యావత్ మహిళా లోకాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తుందన్నారు.

- Advertisement -

ఆపరేషన్ సింధూర్​లో ఇద్దరు మహిళలు ఖురేషి, వైమానిక ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి నారీశక్తి అంటే ఏమిటో ప్రపంచానికి నిరూపించారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకుడు స్వామి యాదవ్, గిరిబాబు, నాగరాజు, బుస్సాపూర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Chakali Ailamma | మహిళా లోకానికి స్ఫూర్తి చాకలి ఐలమ్మ..

అక్షరటుడే, బాన్సువాడ: తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని వ్యవసాయ సలహదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​ రెడ్డి అన్నారు. పట్టణంలోని తాడ్కోల్ రోడ్డులో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమని, ఆమె స్ఫూర్తి తరతరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎర్వాల కృష్ణారెడ్డి, గంగాధర్, ఎజాజ్, నర్సుగొండ, తదితరులు పాల్గొన్నారు.

Chakali Ailamma | టీఎన్జీవోస్​ ఆధ్వర్యంలో..

నగరంలోని వినాయక్​నగర్​ చాకలి ఐలమ్మ విగ్రహానికి టీఎన్జీవోస్​ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా ఛైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్, కార్యదర్శి నేతికుంట శేఖర్ నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, సర్వే శాఖ స్పెషల్ యూనిట్ జిల్లా అధ్యక్షుడు సూర్య ప్రకాష్, జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామి, సలహాదారులు వనమాన సుధాకర్ తదితరులు హాజరయ్యారు.

Chakali Ailamma | ముప్కాల్​లో..

అక్షరటుడే, ముప్కాల్​: మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతిని రజక సంఘం మంగళవారం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంఘ సభ్యులు అందరూ కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సంఘం అధ్యక్షుడు నవీన్ మాట్లాడుతూ ఐలమ్మ చేసిన సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేసిన ఆమె ధైర్యసాహసాలను, పోరాట స్ఫూర్తిని ప్రతిఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు నవీన్‌తో పాటు సెక్రటరీ చరణ్, క్యాషియర్ సత్యనారాయణ, ముఖ్య సలహాదారుడు హన్మాండ్లు, సభ్యులు శ్రీనివాస్, రమేష్, రాజేష్, సవిత, మామత, రాజమణి తదితరులు పాల్గొన్నారు.

Chakali Ailamma | ఆర్మూర్​లో..

అక్షరటుడే, ఆర్మూర్: తెలంగాణ ఉద్యమకారిణి, వీరనారి చాకలి సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే ప్రశాంత్​ రెడ్డి అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో శుక్రవారం ఆమె విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్మూర్​లో బీఆర్ఎస్ నాయకులు ఐలమ్మ జయంతి నిర్వహించారు.

Chakali Ailamma | చంద్రాయన్ పల్లిలో..

అక్షరటుడే, ఇందల్వాయి: మండలంలోని చంద్రాయన్ పల్లి గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు దత్తు మాట్లాడుతూ తెలంగాణ ధీర వనిత చాకలి ఐలమ్మ భావితరాలకు స్ఫూర్తి అని అన్నారు. కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News