అక్షరటుడే, ఇందూరు: Chakali Ailamma | నగరంలోని బోర్గాం(పి) చౌరస్తా వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం (Rajaka sangham) ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ పోరాటస్ఫూర్తి నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. పెత్తందారి వ్యవస్థపై అలుపెరగని పోరాటం చేసిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు.
Chakali Ailamma | ఎల్లారెడ్డిలో..
అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి(Yellareddy) పట్టణంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ మహేష్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా మాట్లాడుతూ చాకలి ఐలమ్మ చేసిన సేవలు, ధైర్యసాహసాలను కొనియాడారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి పట్టణ, మండల రజకులు పాల్గొన్నారు.
Chakali Ailamma | గాంధారిలో..
అక్షరటుడే, గాంధారి: మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని బుధవారం నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు , రజక సంఘ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Chakali Ailamma | బోధన్‌లో..
అక్షరటుడే, బోధన్: సాలూర (salura) మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ(BSP) ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు సింగడి పాండు మాట్లాడుతూ అగ్రవర్ణ నాయకుల దోపిడీని, పెత్తందారి వ్యవస్థపై అలుపెరగని పోరాటం చేసిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు.
బోధన్ (Bodhan) పట్టణ కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్, జిల్లా ఈసీ మెంబెర్ రెడ్డి సాయిలు,అసెంబ్లీ ఇన్‌ఛార్జి నీరడి రవి, అసెంబ్లీ అధ్యక్షుడు బాగారే గంగాధర్, పట్టణ అధ్యక్షుడు సుభాష్, BSP యువ నేత చంద్ర శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
Chakali Ailamma | పోలీస్ శాఖలో..
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని బుధవారం నిర్వహించారు. సీపీ సాయిచైతన్య ఆదేశానుసారం నిజామాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఆఫీస్ సూపరింటెండెంట్లు శంకర్, బషీర్, వనజ రాణి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Chakali Ailamma | పోతంగల్లో..
పోతంగల్లో..