అక్షరటుడే, వెబ్‌డెస్క్: Chain Snatching | నిజామాబాద్ (Nizamabad) నగరంలోని చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. ఈ ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మూడో టౌన్ పోలీస్ స్టేషన్ (Three Town Police Station) పరిధిలో గల సుభాష్ నగర్ ప్రాంతంలో ఉదయం సమయంలో ఓ మహిళ ఇంటి ముందు చెట్లకు పూలు కోస్తుండగా.. ఇద్దరు దుండగులు బైకుపై వచ్చారు. సదరు మహిళ మెడలో నుంచి చైన్‌ను లాక్కుని బైకుపై పరారయ్యారు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మూడోటౌన్ ఎస్సై హరిబాబు (SI Haribabu), సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా.. రెండు తులాల బంగారం చైన్ దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు తెలిపింది.