అక్షరటుడే, వెబ్డెస్క్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. గత కొన్ని నెలల క్రితం వరుసగా చైన్ స్నాచింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఇటీవల నగరంలో ఓ మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. తాజాగా.. నిజామాబాద్ నగరంలోని ఐదో టౌన్ పరిధిలో చైన్ స్నాచింగ్ chain snatching in nizamabad జరిగింది. 300 క్వార్టర్స్ వద్ద సావిత్రి అనే మహిళ మంగళవారం ఉదయం వాకిలి ఊడుస్తున్న సమయంలో ఇద్దరు దుండగులు పల్సర్ బైక్పై వచ్చారు. మహిళ మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. మహిళ అప్రమత్తమయ్యేలోగా స్నాచర్లు పారిపోయారు. దీంతో వెంటనే ఐదో టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై గంగాధర్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు.