అక్షరటుడే, ఆర్మూర్: CP Sai Chaitanya | వరుస చైన్‌స్నాచింగ్‌లకు (Chain snatching) పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర(Maharashtra) నుంచి ఏడుగురు బతుకుదెరువు కోసం నిర్మల్ (Nirmal) జిల్లాలోని మంజులాపూర్‌కు వచ్చారు. కూలిపని చేసినప్పటికీ కుటుంబ పోషణ భారంగా మారడంతో చైన్‌స్నాచింగ్‌లకు అలవాటు పడ్డారు. ఆటోల్లో వెళ్లే మహిళా ప్రయాణికుల మెడలో నుంచి గొలుసులు చోరీలు చేస్తుండేవారు. ఆర్మూర్(Armoor), ముప్కాల్(Mupkal), సారంగపూర్(Sarangapur), భైంసా, మెట్పల్లి, జక్రాన్‌పల్లి ప్రాంతాల్లో వీరు వరుస చోరీలకు పాల్పడ్డారు. పోలీసులు నిఘా పెరగడంతో మహారాష్ట్రకు పారిపోయారు. అనంతరం తిరిగి బైక్‌లపై చోరీలు చేసేందుకు ఆర్మూర్‌కు రాగా వారిని వలపన్ని పట్టుకున్నట్లు సీపీ వివరించారు. కేసును ఛేదించిన ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, సీఐ శ్రీధర్‌రెడ్డి, ఎస్సై రజనీకాంత్‌లను సీపీ అభినందించారు.