అక్షరటుడే, కామారెడ్డి: chain snatch | చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. గల్లీ రోడ్ల నుంచి రహదారుల వరకు ఎక్కడ పడితే అక్కడ దోపిడీకి తెగబడుతున్నారు. బంగారం ధర పెరుగుతూ పోతుండటంతో వాటి ఆభరణాలకు రక్షణ లేకుండా పోతోంది.
కామారెడ్డి జిల్లాలో మరో చైన్ స్నాచింగ్ చోటుచేసుకుంది. కామారెడ్డి పట్టణానికి కూతవేటు దూరంలో ఈ ఘటన జరిగింది. భర్తతో కలిసి బైకుపై వెళ్తున్న మహిళ మెడలో నుంచి దుండగులు పుస్తెల తాడు లాక్కెళ్లారు.
chain snatch | మాజీ ఎంపీటీసీ..
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కమ్మరి శ్రీనివాస్ తన భార్య అనంతలక్ష్మి కలిసి జువ్వాడి గ్రామానికి వెళ్తున్నారు.
తాడ్వాయి నుంచి దగ్గరగా ఉంటుందని వెళ్తుండగా.. దేవునిపల్లి ప్రభుత్వ పాఠశాల సమీపంలో గుర్తుతెలియని దుండగులు బైకుపై వచ్చి అనంతలక్ష్మి మెడలో నుంచి పుస్తెల తాడు లాగారు. వారు లాగిన ఫోర్స్‌కి బైక్ స్కిడ్ అయి భార్యాభర్తలు ఇద్దరు కింద పడిపోయారు.
దీంతో శ్రీనివాస్ ముఖానికి గాయాలయ్యాయి. పుసైల తాడు లాక్కుని దుండగులు పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కాగా గాయపడిన శ్రీనివాస్‌ను జీజీహెచ్‌కు తరలించారు.
