అక్షరటుడే, వెబ్‌డెస్క్: Chahal – Dhanashree | టీమిండియా (Team India) స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ yuzvendra chahal, ఆయన భార్య ధనశ్రీ వర్మల వైవాహిక జీవితం గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఈ జంట మొదట్లో బాగానే కలిసి జీవించారు.
కానీ, కాలక్రమేణ అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయారు. చాహల్, ధనశ్రీ విడాకుల బాట పట్టినట్లు కొన్ని వారాల క్రితం అధికారికంగా వెల్లడైంది. విడాకుల అనంతరం ధనశ్రీ దుబాయ్ వెళ్లి కొత్త జీవితం ప్రారంభించింది.
అక్కడి సంస్కృతి, మత సామరస్యాన్ని ఆస్వాదిస్తూ… హిందూ దేవాలయాన్ని సందర్శించిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. “శాంతిని పొందాను.. ఇది నాకు ఆధ్యాత్మిక పునరుజ్జీవనంగా అనిపించింది..” అంటూ చేసిన పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
Chahal – Dhanashree : ఆమె వల్లనే..
ఇంతలో చాహల్ ఒక పాడ్‌కాస్ట్‌లో స్పందిస్తూ.. “విడాకుల విషయమై మొదట ఎటువంటి కామెంట్ చేయకూడదనుకున్నాను.. మా విడాకులకు పరోక్షంగా ధనశ్రీ Dhana sree వైపు నుంచే తప్పు జరిగింది..” హింట్ ఇచ్చాడు.
తాను ఇప్పుడు ప్రజల అభిప్రాయాలను పట్టించుకోవట్లేదని chahal చెప్పుకొచ్చాడు. అయితే, ఈ జంట విడిపోయేందుకు గల అసలైన కారణాలు ఇంకా స్పష్టంగా బయటకు రాలేదు.
కానీ, ఇద్దరూ తమ సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఒకరిపై ఒకరు కామెంట్స్ చేస్తున్నారు. ఇది చూసిన అభిమానులు ఇప్పటికైనా పర్సనల్ విషయాలను పబ్లిక్ డొమెయిన్‌లోకి తీసుకురావొద్దు అని కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, చాహల్ 2020 డిసెంబర్‌లో డ్యాన్సర్, యూట్యూబర్ అయిన ధనశ్రీ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మొదట్లో వారిద్దరి బంధం బాగానే ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య తలెత్తిన తీవ్ర సమస్యల కారణంగా యుజ్వేంద్ర చాహల్ గత మార్చిలో డైవర్స్ తీసుకున్నాడు.
ఈ విడాకుల ప్రక్రియ తర్వాత ఎదురైన పరిస్థితులు తనను ఎంతగానో కలచివేసినట్టు ఒక ప్రత్యేక కార్యక్రమంలో యుజ్వేంద్ర చాహల్ చెప్పుకొచ్చారు.
“నేను చాలా అలసిపోయాను.. నాలో ఉత్సాహం కూడా పూర్తిగా చచ్చిపోయింది.. చాలా సార్లు ఆత్మహత్య suicide చేసుకుందామని నిర్ణయించుకున్నాను..” అంటూ ఇటీవల యుజ్వేంద్ర చాహల్ ఆవేదన వ్యక్తం చేశాడు. “ప్రతిరోజూ రెండు గంటలు ఏడ్చేవాడినని.. రోజుకు కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోయా..” అని తన బాధని వ్యక్తం చేశాడు చాహల్.