ePaper
More
    Homeక్రీడలుChahal | న‌న్ను మోస‌గాడు అన్నారు.. ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్నా.. ధ‌న‌శ్రీతో విడాకుల‌పై చాహ‌ల్ కామెంట్స్

    Chahal | న‌న్ను మోస‌గాడు అన్నారు.. ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్నా.. ధ‌న‌శ్రీతో విడాకుల‌పై చాహ‌ల్ కామెంట్స్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chahal | భారత స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల ఓ కార్యక్రమంలో ఉద్వేగభరితంగా స్పందించారు. భార్య ధనశ్రీ వర్మ(Dhanashree Verma) చేసిన మోసంతో తాను తీవ్ర మనోవేదనకు గురై, కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య చేసుకోవాలని కూడా భావించినట్టు చాహల్(Chahal) చెప్పారు. ఒకవేళ తనకు నమ్మకమైన స్నేహితులు సహాయపడకపోయినట్లయితే, పరిస్థితి ఎంతటి దాకైనా వెళ్లేదని ఆయన ఓపెన్‌ అయ్యారు. 2020 డిసెంబర్‌లో డ్యాన్సర్, యూట్యూబర్ అయిన ధనశ్రీ వర్మను వివాహం చేసుకున్న చాహల్… 2024 మార్చిలో ఆమెతో విడాకులు తీసుకున్నారు. ఆ విడాకుల ప్రక్రియ అనంతరం తాను మానసికంగా ఎంతో క్షోభ‌ని అనుభ‌వించిన‌ట్టు పేర్కొన్నారు.

    Chahal | సూసైడ్ చేసుకోవాల‌నుకున్నా..

    నిజంగా నాలో జీవించాలనే ఉత్సాహం ఆవిరైంది. రోజూ రెండు గంటలు మాత్రమే నిద్రపోయేవాడిని. ప్రతి రోజు ఏడ్చే రోజులూ వచ్చాయి. దాదాపు 45 రోజులు నరకంలా గడిచాయి. ఆత్మహత్య ఆలోచనలు వచ్చిన సమయంలో తన సన్నిహితులతో మాట్లాడటం ద్వారా తాను కాస్త ఓదార్పు పొందానని చాహల్ తెలిపారు. “వాళ్లు నన్ను గట్టిగా పట్టుకున్నారు. జీవితంపై భయం పోగొట్టారు” అని వెల్లడించారు. విడాకుల (Divorce) అనంతరం తనపై వచ్చిన విమర్శలపై కూడా చాహల్ గట్టిగా స్పందించారు. విడాకుల విష‌యంలో నేనే మోసం చేశానని నిందించారు. కానీ నేను ఎప్పుడూ ఎవరినీ మోసం చేయలేదు. అలాంటి మనిషిని కాదు. నమ్మకాన్ని పాటించే వ్యక్తిని అని స్పష్టం చేశారు. మా రిలేషన్‌షిప్‌(Relationship)కు సంబంధించి ఏం జరిగిందో కొంతమందికి ఏమి తెలియ‌క‌పోయిన‌ వారు నన్ను తప్పుపట్టారు అని చాహల్ అన్నాడు.

    READ ALSO  IND vs ENG | రెండో రోజు ఆట మొద‌లైన అర‌గంటకే కుప్ప‌కూలిన భార‌త్.. స్కోర్స్ ఎంతంటే...!

    ఇద్ద‌రం కూడా కెరీర్‌లో విజయాన్ని సాధించాలని అనుకున్నాం. అదే కారణంగా, వ్యక్తిగత బంధానికి తగినంత సమయం ఇవ్వ‌లేకపోయాం. ఒక దశలో భావోద్వేగ సంబంధాలు కూడా సడలిపోవ‌డంతో రాజీ పడడం తప్ప ఇతర మార్గం క‌నిపించ‌లేదు. అయితే రెండు వ్యక్తుల లక్ష్యాలు, వ్యక్తిత్వాలు ఒకే దిశగా లేకపోతే, ఆ ప్రభావం రిలేషన్‌పై త‌ప్ప‌క ప‌డుతుంది. తాను మానవత్వంతో కూడిన జీవితం గడుపుతున్నానని చెప్పారు. నాకు ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. చిన్నప్పటినుంచి వారితోనే పెరిగాను. ఆడవారిని గౌరవించడం నేను నా తల్లిదండ్రుల నుండి నేర్చుకున్నాను అని పేర్కొన్నారు. తన పేరును బలవంతంగా వివాదాల్లోకి లాగడం బాధించేదని అన్నారు. ఈ కష్టాలను అధిగమించి మళ్లీ ఆటపై దృష్టిపెట్టిన చాహల్ ప్రస్తుతం మళ్లీ గ్రౌండ్‌లో అడుగుపెడుతున్నాడు. ఒకప్పుడు ఆత్మహత్య గురించి ఆలోచించిన వ్యక్తి, ఇప్పుడు తన జీవితంలో మళ్ళీ గెలుస్తున్నాడంటే అది నిజంగా అభినందించదగిన విషయం.

    READ ALSO  IND vs ENG | వ‌ద్ద‌నుకున్న‌వాడే ఆదుకున్నాడు.. తొలి రోజు ఆధిప‌త్యం చాటిన ఇంగ్లండ్ బౌల‌ర్స్

    Latest articles

    Railway Line | ఉత్తరాదికి మరింత వేగంగా రైళ్లు.. కాజీపేట–బల్లార్షా మార్గంలో త్వరలో నాలుగో రైల్వే లైన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Line | తెలంగాణ నుంచి ఇక ఉత్తరాది రైళ్లు మరింత వేగంగా దూసుకు...

    Bodhan | హాస్టళ్లలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి.. లేదంటే చర్యలు తప్పవు: బోధన్​ మున్సిపల్ కమిషనర్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan | ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ....

    Weather Updates | రాష్ట్రానికి నేడు వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం తేలికపాటి వర్షాలు (Scattered Rains)...

    Meenakshi Natarajan padayatra | మీనాక్షి నటరాజన్ పాదయాత్ర.. బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు

    అక్షరటుడే, ఆర్మూర్: తెలంగాణ కాంగ్రెస్ ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్​...

    More like this

    Railway Line | ఉత్తరాదికి మరింత వేగంగా రైళ్లు.. కాజీపేట–బల్లార్షా మార్గంలో త్వరలో నాలుగో రైల్వే లైన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Line | తెలంగాణ నుంచి ఇక ఉత్తరాది రైళ్లు మరింత వేగంగా దూసుకు...

    Bodhan | హాస్టళ్లలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి.. లేదంటే చర్యలు తప్పవు: బోధన్​ మున్సిపల్ కమిషనర్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan | ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ....

    Weather Updates | రాష్ట్రానికి నేడు వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం తేలికపాటి వర్షాలు (Scattered Rains)...