Homeజిల్లాలునిజామాబాద్​ABVP Indure Vibhag | విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఫిర్యాదు

ABVP Indure Vibhag | విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఫిర్యాదు

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: ABVP Indure Vibhag | మూడేళ్ల నుంచి విద్యార్థులకు స్కాలర్షిప్ రాకపోవడంతో ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ శశిధర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం జాయింట్ కలెక్టర్ కిరణ్ కుమార్​కు (Joint Collector Kiran Kumar) వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ.. ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు అందజేస్తామంటూ ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ఉన్నత చదువులకు అవసరమైన సర్టిఫికెట్లు లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి బాలకృష్ణ, శశాంక్, రంజిత్, మున్నా, దినేష్, ప్రేమ్, రాజు, సన్నీ, సునీత, రాజశ్రీ, హేమ తదితరులు పాల్గొన్నారు.