HomeUncategorizedBanakacharla Project | ఏపీ ప్రభుత్వానికి కేంద్ర జల సంఘం లేఖ

Banakacharla Project | ఏపీ ప్రభుత్వానికి కేంద్ర జల సంఘం లేఖ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Banakacharla Project | ఏపీ ప్రభుత్వానికి కేంద్ర జల సంఘం లేఖ రాసింది. ఆంధ్ర ప్రదేశ్​ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్ కోసం ఇటీవల కేంద్రం అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్​ నిర్మాణానికి అనుమతులు ఇవ్వలేమని కేంద్ర నిపుణుల కమిటీ గతంలో చెప్పింది.

తాజాగా కేంద్ర జల సంఘం బనకచర్ల ప్రాజెక్ట్‌​(Banakacharla Project) వివరాలు అడిగింది. గోదావరి వరద జలాలకు సంబంధించి డేటా సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఏపీ ప్రభుత్వం (AP Government) పోలవరం నుంచి గోదావరి జలాలను తరలించడానికి బనకచర్ల ప్రాజెక్ట్​కు శ్రీకారం చుట్టింది. శ్రీశైలం ప్రాజెక్టు కాలువలోని బనకచర్ల హెడ్​ రెగ్యూలేటర్ (Banakacharla Head Regulator)​ వద్దకు గోదావరి జలాలను తరలించాలని ఈ ప్రాజెక్ట్​ ఉద్దేశం. అయితే ఈ ప్రాజెక్ట్​ నిర్మాణంతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం (State Government) వాదిస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy), నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి(Uttam Kumar Reddy) ఢిల్లీకి వెళ్లి బనకచర్ల ప్రాజెక్ట్​కు అనుమతి ఇవ్వొద్దని కేంద్ర జలశక్తి మంత్రిని కోరారు. అనంతరం నిపుణుల కమిటీ ప్రాజెక్ట్​కు అనుమతులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే తాజాగా సీడబ్ల్యూసీ పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్‌ వివరాలు అడగడం గమనార్హం. అంతేగాకుండా ఏపీలో ప్రతిపాదిత ప్రాజెక్ట్‌ల వివరాలపై కేంద్రం నివేదిక కోరింది.

Must Read
Related News