అక్షరటుడే, కామారెడ్డి : Central team : దొంగలు పడ్డాక ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ఉంది కేంద్ర ప్రభుత్వ తీరు. కామారెడ్డి జిల్లాలో గత ఆగస్టులో వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.
ఉమ్మడి జిల్లా చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో మేఘ విస్ఫోటనం చెందింది. ఒక్క రోజులోనే 41 సెం.మీ.కు పైగా వర్షపాతం నమోదైంది. వాగు, వంకా, ఊరు, ఏరు ఏకమైంది. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా వరద flood నీరే దర్శనం ఇచ్చింది.
ఆగస్టు 26, 27వ తేదీల్లో వచ్చిన భారీ వరద వల్ల జాతీయ రహదారుల (national highways) తో సహా మార్గాలన్నీ ధ్వంసం అయ్యాయి. వంతెనలు Bridges కొట్టుకుపోయాయి. చెక్ డ్యామ్లు Check dams రూపం కోల్పోయాయి.
పల్లెలు, పట్టణాలంటూ తేడా లేకుండా జల దిగ్బంధంంలో చిక్కుకుపోయాయి. రైతుల కష్టార్జితం వర్షార్పణం అయింది. సంపాదనంతా వరదల్లో కొట్టుకుపోవడంతో జిల్లాలోని చాలా ప్రాంతాల ప్రజలు నిలువ నీడ లేకుండా పోయారు. విద్యుత్తు వ్యవస్థ దెబ్బతినడంతో రోజుల తరబడి గ్రామాలు అంధకారంలో మగ్గిపోయాయి.
ఇంతటి ప్రళయం జరిగిన నెలన్నర తర్వాత కేంద్ర బృందం జిల్లా పర్యటనకు వస్తోంది. ప్రళయం తాలూకు ఆనవాళ్లు ఇప్పటికే కోల్పోయాయి. జలం సృష్టించిన విధ్వంసాన్ని ప్రజలు మరచిపోయి ఎవరి పనుల్లో వారు ఉండిపోయారు. అంతా సద్దుమణిగాక ఇప్పుడు తీరిగ్గా అంటే బుధవారం (అక్టోబరు 8) వరద మిగిల్చిన బీభత్సాన్ని తెలుసుకునేందుకు వస్తోంది.
Central team | కేంద్ర బృందం పర్యటన వివరాలు
- ఉదయం 11 గంటలు: భిక్కనూరు మండల కేంద్రంలో తెగిపోయిన దాసన్న కుంట పరిశీలన
- ఉదయం 11:10 గంటలు: భిక్కనూరు మండలం అంతంపల్లిలో ధ్వంసమైన పంచాయతీ రాజ్ రోడ్డు పరిశీలన
- ఉదయం 11:15 గంటలు: అంతంపల్లి గ్రామంలో పంట నష్టం పరిశీలన
- మధ్యాహ్నం 12:00 గంటలు: జాతీయ రహదారి నుంచి బీబీపేట – తుజాల్పూర్ అప్రోచ్ రోడ్డు పరిశీలన
- మధ్యాహ్నం 1:00 గంటలు: కామారెడ్డి పట్టణంలో జీఆర్ కాలనీ బ్రిడ్జి పరిశీలన
- మధ్యాహ్నం 1:05 గంటలు: కామారెడ్డి పట్టణంలో ధ్వంసమైన ఫిల్టర్ బెడ్, కాజ్ వే, రోడ్డు పరిశీలన
- మధ్యాహ్నం 1:10 – 2:00 గంటలు: జిల్లా కలెక్టరేట్లో ఫొటో ఎగ్జిబిషన్, వీడియో ప్రెసెంటేషన్
- మధ్యాహ్నం 2:30 గంటలు: లింగంపేట మండలం లింగంపల్లి ఖుర్దు వద్ద ధ్వంసమైన ఆర్ అండ్ బీ బ్రిడ్జి పరిశీలన
- మధ్యాహ్నం 3:10 గంటలు: ఎల్లారెడ్డి మండలం అడవి లింగాల వద్ద ధ్వంసమైన కామారెడ్డి ఎల్లారెడ్డి రోడ్డు పరిశీలన
- మధ్యాహ్నం 3:30 గంటలు: ఎల్లారెడ్డి మండలంలో పంట నష్టం పరిశీలనతో పాటు ఎల్లారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువు పరిశీలన
- సాయంత్రం 4:00 గంటలు: నాగిరెడ్డిపేట మండలంలో పంట నష్టం పరిశీలన, చినూర్ వాడి బంజారా బ్రిడ్జి పరిశీలన
- సాయంత్రం 4:40 – 6:00 గంటలు: ధ్వంసమైన పోచారం ప్రాజెక్టు పరిశీలన