అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని గతనెలలో భారీ వర్షాలు (heavy rains) అతలాకుతలం చేశాయి. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ సందర్భంగా బుధవారం కేంద్ర బృందం నియోజకవర్గంలో (Yellareddy constituency) పర్యటించింది.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్తో (Collector Ashish Sangwan) కలిసి బృంద సభ్యులు వరద కారణంగా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలంచారు. నియోజకవర్గంలోని లింగంపేట మండలం లింగంపల్లి కుర్ధు బ్రిడ్జిని, ఎల్లారెడ్డి మండలంలోని పంట పొలాలను, నాగిరెడ్డి పేట మండలంలోని మంజీరా ముంపు వరదతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు.
పోచారం ప్రాజెక్టు (Pocharam project) ఓవర్ హెడ్ వద్ద మట్టి కొట్టుకుపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. కేంద్ర బృందం సభ్యులు కలెక్టర్ ఇతర అధికారులతో పంట నష్టం ఆస్తి నష్టానికి జరిగిన వివరాలు సేకరించారు. వరదల వల్ల జరిగిన నష్ట నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్లు వారు తెలిపారు.