అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కామారెడ్డి నియోజకవర్గంలో (Kamareddy constituency) కేంద్ర బృందం పర్యటన ముగిసింది. ఈ మేరకు బుధవారం ఉదయం 10:30 గంటలకు భిక్కనూరు మండల కేంద్రానికి చేరుకున్న బృందం మండల కేంద్రంలోని ధాస్నమ్మ కుంటను పరిశీలించింది. అక్కడి నుంచి అంతంపల్లి గ్రామంలో ధ్వంసమైన పంచాయతీ రాజ్ రోడ్డు (Panchayat Raj road), పంట నష్టాన్ని పరిశీలించారు. బీబీపేట బ్రిడ్జిని (BiBipet bridge) పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
కామారెడ్డి పట్టణంలోని జీఆర్ కాలనీ వద్ద తెగిపోయిన బ్రిడ్జిని పరిశీలించి అక్కడినుంచి వైకుంఠదామం వెళ్లే దారిలో ఉన్న ఫిల్టర్ బెడ్ పంప్ హౌస్, తెగిపోయిన కాజ్‌వేను పరిశీలించి కలెక్టర్ ద్వారా వివరాలు సేకరించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను తిలకించారు. అక్కడినుంచి లింగంపేట మండలానికి (Lingampet mandal) బయలుదేరారు. కేంద్ర బృందం వెంట కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఇతర శాఖల అధికారులు ఉన్నారు.