అక్షరటుడే, కామారెడ్డి: BJP Kamareddy | కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఇంటికి చేరవేయాలని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ విపుల్ జైన్ అన్నారు.
మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి (Devunipally) మున్నూరు కాపు సంఘ (Munnur Kapu Sangham) భవనంలో శుక్రవారం నిర్వహించిన పట్టణ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం 11 ఏళ్లుగా సాధించిన విజయాలను పట్టణంలోని 49 వార్డుల్లో ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు రజనీకాంత్, జిల్లా అధికార ప్రతినిధి నరేందర్, కాసర్ల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు రాజుపాటిల్, పెద్దోళ్ల గోపాల్, రజినీకాంత్, రఘు, ప్రతాప్ నేత, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.