అక్షరటుడే, నిజాంసాగర్: Central lighting | పిట్లం మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనులు ఏళ్లుగా నిలిచిపోయామని వెంటనే పనులు పూర్తిచేయాలని బీజేపీ కామారెడ్డి (BJP Kamareddy) జిల్లా మాజీ అధ్యక్షురాలు అరుణతార (Arunathara) డిమాండ్ చేశారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పనులు వెంటనే పూర్తి చేయాలని లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
జుక్కల్ నియోజకవర్గంలో (Jukkal Constituency) సెంట్రల్ లైటింగ్ వ్యవస్థపై అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. నిరసనలో జిల్లా బీజేపీ నాయకులు రాము, అశోక్, రాజ్, రవిచంద్ర, పిట్లం మండల పార్టీ అధ్యక్షుడు గుండా సాయిరెడ్డి, మాజీ అధ్యక్షుడు అభినయ్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి దేవేందర్, ఉపాధ్యక్షుడు సాయిగొండ, లాకావత్ గోపాల్, సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి, ధర్మారం శివాజీ పటేల్, మద్దెల నవీన్, రాంప్రసాద్, రాములు, విజయ భాస్కర్, కృష్ణ షెట్కార్, పండరి రెడ్డి, వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

