Homeతాజావార్తలుNizamabad central jail | వివాదాలకు కేంద్ర బిందువుగా సెంట్రల్​ జైలు

Nizamabad central jail | వివాదాలకు కేంద్ర బిందువుగా సెంట్రల్​ జైలు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Nizamabad central jail | నిజామాబాద్​ సెంట్రల్​ జైలు వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ పనిచేసిన అధికారుల వ్యవహార శైలి ఇందుకు కారణమవుతోంది. గతంలో పనిచేసిన అధికారులు అక్రమ మొరం తవ్వకాలు జరిపించి రూ. కోట్లు దండుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇదే సమయంలో ఖైదీలకు సౌకర్యాలు కల్పించి డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఇది సరిపోదంటూ తాజాగా ఓ అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం మరోసారి సెంట్రల్​ జైలు (Nizamabad central jail) రచ్చకెక్కినట్లయ్యింది.

సెంట్రల్​ జైలులో పనిచేస్తున్న ఓ అధికారి అదే డిపార్ట్​మెంట్​లో పనిచేస్తున్న ఉద్యోగి పట్ల వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఓ పోస్టు సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యింది. పలు మీడియాల్లో సైతం కథనాలు వచ్చాయి. దీంతో స్పందించిన జైళ్ల శాఖ (prisons department) ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. విచారణ కొనసాగుతుండగానే.. బాధిత ఉద్యోగిని వేధింపు ఆరోపణలు కొట్టిపారేశారు. తనను వేధించారంటూ వచ్చిన ఆరోపణలు అవాస్తవమని ప్రకటించారు. అయినప్పటికీ సదరు అధికారి వ్యవహార శైలిపై పలు ఆరోపణలు రావడం.. గతంలో పనిచేసిన చోట కూడా ఇలాంటి ఘటనలే జరగడంతో అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.

కాగా.. సెంట్రల్​ జైల్​లో జరుగుతున్న తంతుపై ఓ యువకుడు జిల్లా న్యాయమూర్తికి (Nizamabad district judge) ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెలవులు ఉండడంతో దసరా తర్వాత విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఏదిఏమైనా ఖైదీలలో సత్ర్పవర్తన తీసుకురావాల్సిన జైళ్లలో శాఖలో వరుస వివాదాలు జరగడం చర్చకు దారి తీసింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు శాఖను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది.