అక్షరటుడే, బాన్సువాడ: Banswada | కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే, బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌ఛార్జి యెండల లక్ష్మీనారాయణ (Yendala Lakshminarayana) సూచించారు.
నస్రుల్లాబాద్ మండలంలో (Nasrullabad Mandal) బీజేపీ మండల అధ్యక్షుడు చందూరి హన్మాండ్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు, జన్‌ధన్ ఖాతాలు, ఉచిత బియ్యం వంటి పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు.
పంచాయతీల్లో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమం కేంద్ర నిధుల ద్వారానే సాధ్యమవుతోందని పేర్కొన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని, నస్రుల్లాబాద్ మండలంలోని ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగరడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్‌ఛార్జి మోహన్ రెడ్డి, సున్నం సాయిలు, వడ్ల సతీష్, లక్ష్మణు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.