HomeUncategorizedMIB | సరిహద్దులో ఉద్రిక్తతలు.. మీడియాకు కేంద్రం కీలక ఆదేశాలు..

MIB | సరిహద్దులో ఉద్రిక్తతలు.. మీడియాకు కేంద్రం కీలక ఆదేశాలు..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: MIB | పహల్​గామ్​ ఉగ్రదాడి(Pahalgam terrorist attack) నేపథ్యంలో భారత్​ ‌‌– పాకిస్తాన్​ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగు రోజులుగా ఇదే ప్రధాన అంశంగా దేశంలోని మీడియా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్మీ కార్యకలాపాల గురించి ఎప్పటికప్పుడు పలు వార్తలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ(MIB) మీడియాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మిలిటరీ కార్యకలాపాలకు సంబంధించిన కవరేజ్‌ని నిలిపేయాలని ఆదేశించింది.

MIB | అన్ని ప్లాట్​ఫారంలకు అడ్వైజరీ జారీ

దేశంలోని అన్ని మీడియా సంస్థలు, సోషల్​ మీడియా ప్రతినిధులకు అడ్వైజరీ(advisory) జారీ చేసింది. రక్షణకు సంబంధించిన సమాచారం కానీ ఫొటోలు ప్రచురించవద్దని పేర్కొంది. జాతీయ భద్రతకు సంబంధించి సున్నితమైన వివరాల ప్రచురణలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జాతీయ భద్రత దృష్ట్యా, అన్ని మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, వార్తా సంస్థలు, సోషల్ మీడియా వినియోగదారులు అత్యంత బాధ్యత వహించాలని సూచించింది. మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని పేర్కొంది. ముఖ్యంగా, రక్షణ కార్యకలాపాలు, కదలికలకు సంబంధించిన “సోర్స్ బేస్డ్” సమాచారం ఇవ్వకూడదని తెలిపింది. సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడం వల్ల అనుకోకుండా శత్రు అంశాలకు సహాయపడవచ్చని పేర్కొంది.

Must Read
Related News