ePaper
More
    HomeజాతీయంJammu Railway Division | కొత్త రైల్వే డివిజన్​గా జమ్మూ

    Jammu Railway Division | కొత్త రైల్వే డివిజన్​గా జమ్మూ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Jammu Railway Division | కేంద్ర ప్రభుత్వం (central government) జమ్మూకశ్మీర్​ అభివృద్ధికి పలు చర్యలు చేపడుతోంది. పర్యాటకంగా డెవలప్​ చేయడంతో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తోంది. అంతేగాకుండా జమ్మూ రైల్వే డివిజన్​ను (Jammu Railway Division) సైతం ఏర్పాటు చేసింది. గతంలో జమ్మూ ఉత్తర రైల్వే జోన్​ (Northern Railway Zone) కింద ఉండేది. నూతన రైల్వే డివిజన్​ను ఏర్పాటు చేస్తూ మే 29న కేంద్ర ప్రభుత్వం గెజిట్​ విడుదల చేసింది. ఇది జూన్​ 1 నుంచి అమలులోకి వచ్చింది. కాగా భారత రైల్వో 70 వ డివిజన్​ కావడం గమనార్హం.

    Jammu Railway Division | జనవరిలో ప్రారంభించిన ప్రధాని

    కొత్త డివిజన్ గణనీయమైన ప్రాంతాన్ని పర్యవేక్షిస్తుంది. ఫిరోజ్‌పూర్ డివిజన్ (Ferozepur Division) నుంచి జమ్మూ డివిజన్​కు పలు ప్రాంతాలను బదిలీ చేశారు. జనవరి 6న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) జమ్మూ రైల్వే డివిజన్‌ను ప్రారంభించారు. కొత్త డివిజన్లో పఠాన్‌కోట్–జమ్మూ– అమరవీరుడు కెప్టెన్ తుషార్ మహాజన్–శ్రీనగర్–బారాముల్లా (423 కి.మీ), భోగ్‌పూర్ సిర్వాల్–పఠాన్‌కోట్ (87 కి.మీ), బటాలా–పఠాన్‌కోట్ (68 కి.మీ) మరియు పఠాన్‌కోట్–జోగిందర్ నగర్ నారో గేజ్ సెక్షన్ (164 కి.మీ)లు ఉన్నాయి.

    Jammu Railway Division | రక్షణ ప్రయోజనాలకు ముఖ్యం

    జమ్మూ డివిజన్ మొదటి DRM వివేక్ కుమార్ (Jammu Division First DRM Vivek Kumar) మాట్లాడుతూ ఈ డివిజన్ ఏర్పాటు కాశ్మీర్‌తో అనుసంధానానికి ఎంతో దోహద పడుతుందన్నారు. అంతేగాకుండా రక్షణ ప్రయోజనాలకు కూడా ముఖ్యమైనదని పేర్కొన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...