అక్షరటుడే, కామారెడ్డి: Labour Laws | కేంద్ర ప్రభుత్వం కార్మికులను మోసం చేస్తోందని సీఐటీయూ, రైతు సంఘాల (CITU and farmers associations) నాయకులు ఆరోపించారు. సీఐటీయూ, రైతు సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నోటికి నల్ల గుడ్డలు ధరించి నిరసన తెలిపారు.
Labour Laws | నాలుగు లేబర్ చట్టాలు తెచ్చి..
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కార్మికులకు 29 చట్టాలు ఉంటే వాటిని కేంద్ర ప్రభుత్వం (central government) కుదించి నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకు వచ్చిందన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా కంపెనీ యాజమాన్యాలకు అనుకూలంగా చట్టాలు రూపొందిస్తుందని వారు ఆరోపించారు. ఇది కార్మికులను మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మద్దతు ధర అమలు చేయకుండా మొండిచేయి చూపుతుందని వారు పేర్కొన్నారు.
Labour Laws | కేంద్రం మెడలు వంచి..
రైతులకు వ్యతిరేకంగా నాలుగు నల్ల చట్టాలు తీసుకొస్తే రైతులు పెద్దఎత్తున పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి చట్టాలు రద్దయ్యేలా చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పద్ధతిని మార్చుకోకపోతే కార్మికులను, రైతులను ఏకం చేసి మరో పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్, అరుణ్ కుమార్, రైతుసంఘం నాయకుడు వెంకట్ గౌడ్, మోహన్, దశరథ్, రాజు, శీను తదితరులు పాల్గొన్నారు.