అక్షరటుడే, వెబ్‌డెస్క్ : central government | రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం (central government) కొత్త ప్రభుత్వం తీసుకొచ్చింది.
రోడ్డు ప్రమాదాల్లో (Road Accident) గాయపడిన వారికి, వారి కుటుంబాలకు చేయూతనిచ్చేలా ‘క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ ఫర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీం -2025’ను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితులకు (road accident victims) నగదు రహిత చికిత్స పథకాన్ని అందించేందుకు గాను కేంద్రం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. సోమవారం నుంచే అమలులోకి వచ్చిన ఈ పథకం కింద బాధితుడు ప్రమాదం జరిగిన తేదీ నుంచి ఏడు రోజుల వరకు ఏదైనా గుర్తింపు పొందిన హాస్పటల్లో గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స పొందవచ్చు.
central government | తరచూ ప్రమాదాలు..
దేశంలో రోడ్డు ప్రమాదాలు (road accidents) నిత్యకృతమయ్యాయి. ఎంతో మంది మరణిస్తుండగా, లక్షలాది మంది క్షతగాత్రులవుతున్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 5 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. దాదాపు 4 లక్షల మంది తీవ్రంగా గాయపడుతున్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల ఎక్కువగా నష్టపోతోంది ద్విచక్ర వాహనదారులు, పాదచారులేనని నేషనల్ క్రైం (National Crime) రికార్డ్స్బ్యూరో వెల్లడించింది.
central government | ఉచిత చికిత్స
ఎవరైనా వాహనం వల్ల రోడ్డు ప్రమాదానికి గురైతే ఈ పథకం (scheme) కింద దేశంలోని ఏ ప్రాంతంలోనైనా వారికి ఉచిత చికిత్స (free treatment) లభిస్తుంది. బాధితుడు ప్రభుత్వ లేదా ప్రైవేట్ దవాఖానల్లో (government or private hospitals) ఉచితంగా చికిత్స పొందవచ్చు. డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రమాదం జరిగిన తేదీ నుంచి ఏడు రోజుల వరకూ గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు ఉచిత చికిత్స (free treatment) పొందవచ్చు. అయితే, ప్రభుత్వం (government) ఎంపిక చేసిన ఆసుపత్రులలో మాత్రమే ఈ సౌకర్యం పూర్తిగా వర్తిస్తుంది. కేంద్రం తెచ్చిన ఈ కొత్త పథకాన్ని అమలు చేయడానికి నేషనల్ హెల్త్ అథారిటీ (National Health Authority), రాష్ట్ర పోలీసులు, ఆసుపత్రులు, రాష్ట్ర ఆరోగ్య సంస్థతో కలిసి పని చేయనున్నాయి.