అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Union Cabinet Decisions | ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav) శనివారం వివరాలు వెల్లడించారు. పలు రోడ్డు మార్గాలను జాతీయ రహదారులుగా విస్తరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
హైదరాబాద్ (Hyderabad)–పనాజీ ఆర్థిక కారిడార్‌లోని గుడేబెల్లూర్ నుంచి మహబూబ్‌నగర్ (Mahabubnagar) వరకు ఉన్న జాతీయ రహదారి-167ను తెలంగాణలో నాలుగు లేన్లుగా విస్తరించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 80 కిలోమీటర్ల మేర విస్తరణ కోసం రూ.3,175 కోట్లు కేటాయించింది. దీంతో తెలంగాణలోని మహబూబ్ నగర్, నారాయణపేట, రాయచూర్, దేవరకద్ర, మక్తల్, హైదరాబాద్ జిల్లాలకు మేలు జరగనుంది. ప్రయాణ సమయం 3 గంటలు నుంచి 1.5 గంటలకు తగ్గుతుంది. పరిశ్రమలు, వాణిజ్య మార్గాలను అనుసంధానించడం ద్వారా ప్రాంతీయ వృద్ధిని పెంచుతుందని కేంద్ర మంత్రి తెలిపారు హైదరాబాద్‌లోని NICDC, ఫార్మా & మెడికల్ క్లస్టర్లు, SEZలను ఈ మార్గం అనుసంధానిస్తుందన్నారు.
Union Cabinet Decisions | రైల్వే లైన్లకు..
కాసర–మన్మాడ్ మార్గంలో 3, 4వ లైన్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముంబై–హౌరా హై డెన్సిటీ రూట్లో సామర్థ్యాన్ని నాలుగు రెట్లు పెంచాలని ప్రతిపాదించింది. ఢిల్లీ-జమ్మూ నెట్‌వర్క్‌లో క్వాడ్రప్లింగ్ సామర్థ్యం కల్పించాలని నిర్ణయించింది. పర్యాటక కేంద్రాలకు మెరుగైన కనెక్టివిటీ కల్పించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు పలు మార్గాల్లో రైళ్ల సంఖ్యను సైతం పెంచనున్నట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బళ్లారి-హోసాపేట 3వ & 4వ లైన్ (65 కి.మీ)కు రూ.2,372 కోట్లతో క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బ్రహ్మపుత్ర నది కింద దేశంలోనే మొదటి ట్విన్-ట్యూబ్ రోడ్ రైలు సొరంగానికి ఓకే చెప్పింది.