అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Banakacherla Project | ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్ గురించి కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ (Rajya Sabha)లో కీలక ప్రకటన చేసింది. గోదావరి జలాలను (Godavari water) కృష్ణ బేసిన్‌కు తరలించి రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మిస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్‌తో గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. బీఆర్ఎస్ నాయకులు బనకచర్లకు వ్యతిరేకంగా మాట్లాడడంతో పాటు ప్రభుత్వం గోదావరి జలాలను ఏపీకి తరలిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో తాజాగా ఎంపీ ప్రశ్నశకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
Banakacherla Project | ఇంకా పనులు చేపట్టలేదు
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అనిల్‌కుమార్ (MP Anil Kumar) బనకచర్ల ప్రాజెక్ట్‌పై రాజ్యసభలో సోమవారం ప్రశ్న వేశారు. దీంతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పింది. బనకచర్ల పనులు ఇంకా చేపట్టలేదని ఏపీ సర్కార్ చెప్పిందని కేంద్రం తెలిపింది. బనకచర్ల సాంకేతిక-ఆర్థిక అంచనా కోసం కేంద్రం తగిన ప్రక్రియను అనుసరిస్తోందన్నారు. ఈ మేరకు గోదావరి పరీవాహక రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది.