52
అక్షరటుడే, వెబ్డెస్క్: Union Cabinet | కేంద్ర కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) పేరు మార్చాలని నిర్ణయించింది. కాగా.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2027లో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన (Census)కు నిధుల కేటాయింపునకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సెన్సెస్కు సంబంధించి రూ.11,718 కోట్లు కేటాయిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. దీంతో 2027 ఫిబ్రవరి నుంచి తొలిసారి డిజిటల్ జనగణన (Digital Census) నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) తెలిపారు. రెండు విడతల్లో జనగణన చేయనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా కులగణన (Caste Census) చేయనున్నట్లు చెప్పారు.