అక్షరటుడే, డిచ్పల్లి : MLA Bhupathi Reddy | నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి (MLA Bhupathi Reddy) తల్లి నరసమ్మ అనారోగ్యంతో సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే.. ఆమె అంత్యక్రియలను నగర శివారులోని గూపన్పల్లి (Goopanpalli) వైకుంఠధామంలో కుటుంబ సభ్యులు మంగళవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు రాజకీయ పార్టీల ప్రముఖులు ఎమ్మెల్యే తల్లి నరసమ్మ పార్థీవదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయనను పరామర్శించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కాటిపల్లి నగేష్ రెడ్డి, శేఖర్ గౌడ్ పరామర్శించిన వారిలో ఉన్నారు.

1 comment
[…] రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (MLA Bhupathi Reddy) ఎంతో మందికి సేవచేస్తూ […]
Comments are closed.