HomeUncategorizedAir India Flight Crash | అహ్మ‌దాబాద్ విమాన ప్ర‌మాదం.. దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన ప్ర‌ముఖులు

Air India Flight Crash | అహ్మ‌దాబాద్ విమాన ప్ర‌మాదం.. దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన ప్ర‌ముఖులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Air India Flight Crash | గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో (Ahmedabad) ఈరోజు మధ్యాహ్నం జ‌రిగిన పెను ప్ర‌మాదం అంద‌రూ ఉలిక్కి ప‌డేలా చేసింది. 242 మంది ప్రయాణికులతో లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (Air India Flight) టేకాఫ్ అయిన క్షణాల వ్యవధిలోనే కుప్పకూలింది. ఈ విమాన ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది మాటలకందని విషాదమని పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. సహాయక చర్యలపై మంత్రులతో మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే గుజరాత్​ సీఎంతో మాట్లాడారు. అనంతరం గుజరాత్​కు బయలుదేరి వెళ్లారు.

Air India Flight Crash | దుర‌దృష్ట‌క‌ర ఘ‌ట‌న‌..

ఇక విమాన ప్రమాద ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురిచేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) పేర్కొన్నారు. ఈ దురదృష్టకర సంఘటన పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికులు, విమాన సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో పాటు, ఈ ఘటన వల్ల ప్రభావితమైన స్థానిక నివాసితుల గురించి తాను ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. బాధిత ప్రయాణికులు, సిబ్బంది, వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి వెల్లడించారు. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ విపత్తులో ప్రభావితమైన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అని లోకేశ్ (Nara Lokesh) పేర్కొన్నారు. విమాన ప్రమాదం గురించి తెలిసి బాధకు గురయ్యామని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan), మాజీ సీఎం జ‌గ‌న్ (YS Jagan) పేర్కొన్నారు. ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.

బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. విమాన ప్రమాద ఘటన తెలిసి షాక్‌కు గురయ్యానని వైసీపీ నేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ (YS Jagan) అన్నారు. బ్రిటన్‌ ప్రధాన మంత్రి (UK PM) కీర్‌ స్టార్మర్‌ (Keir Starmer) కూడా స్పందించారు. ఈ మేరకు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బ్రిటీష్ పౌరులతో లండన్‌ వెళ్తున్న విమానం అహ్మదాబాద్‌లో కూలిపోయిందని, పరిస్థితిపై భారత్‌ను సంప్రదిస్తున్నట్లు తెలిపారు. ప్ర‌ముఖ న‌టులు జాన్వీ క‌పూర్, దిశా ప‌టాని, అల్లు అర్జున్, జూనియ‌ర్ ఎన్టీఆర్, మంచు విష్ణు, అనుప‌మ్ ఖేర్, అక్ష‌య్ కుమార్, ప్ర‌గ్యా జైస్వాల్, రితేష్ దేశ్ ముఖ్, ర‌కుల్ ప్రీత్ సింగ్ వంటి వారు ఈ ప్ర‌మాదంపై విచారం వ్య‌క్తం చేశారు.

Must Read
Related News