అక్షరటుడే, డిచ్పల్లి: Telangana University | జిల్లాకు వ్యవసాయ కళాశాల ప్రభుత్వం మంజూరు చేయడాన్ని హర్షిస్తూ డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల (Telangana University Arts College) ఎదుట సంబురాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా తెయూ పరిశోధక విద్యార్థి సంఘం అధ్యక్షుడు పుప్పాల రవి ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (PCC President Mahesh Kumar Goud) చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా పుప్పాల రవి మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల నాయకుడు రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాను ఎడ్యుకేషన్ హబ్ మారుస్తున్నారన్నారు. కళాశాల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేలు డాక్టర్ భూపతి రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.