Homeజిల్లాలునిజామాబాద్​Mahalakshmi Scheme | రేపు నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్​లో సంబురాలు

Mahalakshmi Scheme | రేపు నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్​లో సంబురాలు

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Mahalakshmi Scheme | మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 200 కోట్ల మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని.. ఇందులో భాగంగా సంబురాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం  ఓ ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్ బస్టాండ్​లో (Nizamabad Busstand) బుధవారం సంబురాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

జిల్లాలో 5.84 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని తెలియజేశారు. దీనికిగాను.. రూ.239.17 కోట్లను ప్రభుత్వం తెలంగాణ ఆర్టీసీకి (TGS RTC) చెల్లించడం జరిగిందని తెలిపారు. కాగా.. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 2023 డిసెంబర్ 9వ తేదీ నుంచి విజయవంతంగా అమలవుతోందని స్పష్టం చేశారు.

Must Read
Related News