ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Kaloji Narayana Rao | ఘనంగా ప్రజాకవి కాళోజీ జయంతి

    Kaloji Narayana Rao | ఘనంగా ప్రజాకవి కాళోజీ జయంతి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Kaloji Narayana Rao | ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్​లోని (Nizamabad Collectorate) కాన్ఫరెన్స్ హాల్​లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ (Backward Classes Welfare Department) ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.

    రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి (Rural MLA Bhupathi Reddy), కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం, కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాళోజీ నారాయణ రావు అందించిన సేవలను వక్తలు కొనియాడారు.

    అంతకుముందు వర్ని చౌరస్తాలో ఉన్న కాళోజీ విగ్రహానికి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP...

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...

    Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జల వికాసం పథకం కింద లబ్ధిదారులను గుర్తించాలి

    అక్షరటుడే, ఇందూరు: Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జలవికాసం పథకం ద్వారా...