HomeUncategorizedIran-Israel Ceasefire | కాల్పుల విరమణ ఉల్లంఘన.. ఇరాన్​ – ఇజ్రాయెల్​పై ట్రంప్ అసహనం

Iran-Israel Ceasefire | కాల్పుల విరమణ ఉల్లంఘన.. ఇరాన్​ – ఇజ్రాయెల్​పై ట్రంప్ అసహనం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Iran-Israel Ceasefire | ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల ఒప్పందాన్ని కొన్ని గంటల వ్యవధిలోనే రెండు దేశాలు ఉల్లంఘించాయి. పరస్పరం బాంబులతో దాడులు చేసుకున్నాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇజ్రాయెల్​కు హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్​పై వైమానిక దాడులు చేయవద్దని హెచ్చరించారు. అలాంటి చర్యను “తీవ్ర ఉల్లంఘన” అని పేర్కొన్నారు. “మీరు అలా చేయడం తీవ్రమైన ఉల్లంఘనే. మీ పైలట్లను వెంటనే వెనక్కి పిలవండి” అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో పోస్టు చేశారు.

Iran-Israel Ceasefire | రెండు దేశాలు ఉల్లంఘించాయి..

మధ్యప్రాచ్యం(Middle East)లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇజ్రాయెల్(Israel), ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ మంగళవారం ఉదయం ప్రకటించారు. ఈ విషయాన్ని రెండు దేశాలు కూడా ధ్రువీకరించాయి. అయినప్పటికీ ఇజ్రాయెల్ – ఇరాన్(Iran) రెండూ పరస్పర దాడులతో కాల్పుల విరమణ నిబంధనలను ఉల్లంఘించాయని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హేగ్​లో జరిగే నాటో శిఖరాగ్ర సమావేశానికి(Hague NATO summit) బయలుదేరే ముందు ఆయన వైట్ హౌస్(White House) వద్ద విలేకరులతో మాట్లాడారు. నిరంతర దాడుల పట్ల నిరాశ వ్యక్తం చేశారు. “వారు కాల్పుల విరమణను ఉల్లంఘించారు, ఇజ్రాయెల్ వెంటనే తన పైలట్లను వెనక్కి పిలవాలి. దాడులు చేయడం కాల్పుల విరమణను ఉల్లంఘించడమే. నేను ఇజ్రాయెల్ తీరుతో తాను సంతోషంగా లేనని” చెప్పారు.

Must Read
Related News