ePaper
More
    Homeఅంతర్జాతీయంOperation Sindoor | కాల్పుల విర‌మ‌ణ మా ప్ర‌తిపాద‌నే.. పాకిస్తాన్ ఉప‌ ప్ర‌ధాని వెల్ల‌డి

    Operation Sindoor | కాల్పుల విర‌మ‌ణ మా ప్ర‌తిపాద‌నే.. పాకిస్తాన్ ఉప‌ ప్ర‌ధాని వెల్ల‌డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Operation Sindoor | ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి వ్య‌తిరేకంగా భార‌త్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సింధూర్‌తో బెంబేలెత్తిన పాకిస్తాన్(Pakistan) కాళ్ల బేరానికి వ‌చ్చింది. కాల్పుల విర‌మ‌ణకు దాయాది తొలుత ప్ర‌తిపాదించ‌డంతో కేంద్రం అంగీక‌రించింది. అయితే, త‌న వ‌ల్లే రెండు దేశాలు వెన‌క్కి త‌గ్గాయ‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Doanld Trump) ప‌లుమార్లు చెప్పుకోవ‌డంతో ఇది కాస్త వివాద‌స్ప‌ద‌మైంది. అయితే, ప్ర‌ధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఇటీవ‌ల ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన స‌మ‌యంలో ఇరు దేశాల మ‌ధ్య మ‌ధ్య‌వ‌ర్తిత్వాన్ని అంగీక‌రించే లేద‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో రెండ్రోజుల క్రితం ట్రంప్ తొలిసారి భార‌త్‌-పాక్ కాల్పుల విర‌మ‌ణ‌లో త‌న పాత్ర లేద‌ని వెల్ల‌డించారు. అయితే, తాజాగా పాకిస్తాన్ అస‌లు విష‌యాన్ని వెల్ల‌డించింది.

    భార‌త్‌-పాకిస్తాన్‌ల మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ‌కు తామే ప్ర‌తిపాదించామ‌ని పేర్కొంది. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) సందర్భంగా భారతదేశం తమ రెండు కీలక వైమానిక స్థావరాలు రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్, షోర్‌కోట్ ఎయిర్‌బేస్ లను లక్ష్యంగా చేసుకున్నట్లు పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్(Ishaq Dar) అంగీకరించారు. ఈ నేప‌థ్యంలో త‌మ‌పై దాడులు ఆపాల‌ని భార‌త్‌ను కోరిన మాట వాస్త‌వ‌మేన‌ని వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఓ న్యూస్ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాన్ని తెలిపారు.

    Operation Sindoor | అమెరికా జోక్యం కోరాం..

    భారతదేశం చేసిన దాడుల వల్ల జరిగిన నష్టం ఎంత ఉందో పాకిస్తాన్ ప్రభుత్వం(Pakistan Government), సైన్యం అనేకసార్లు తిరస్కరించిన తర్వాత దార్ నుంచి ఈ ప్రకటన రావ‌డం గ‌మ‌నార్హం. పాకిస్తాన్ తిరిగి దాడి చేయడానికి సిద్ధమవుతున్న సమయంలోనే దాడులు జరిగాయని, అంటే భారత్ వేగంగా వ్యవహరించి వారిని అప్రమత్తంగా పట్టుకున్నదని దార్ వెల్లడించారు. ఈ దాడుల వ‌ల్ల త‌మ దేశానికి భారీ న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం ఉండడంతో ఈ విష‌యంలో జోక్యం చేసుకోవాల‌ని కోరిన‌ట్లు పాక్ ఉప ప్ర‌ధాని తెలిపారు.

    భారత దాడులు జరిగిన 45 నిమిషాల్లోనే, సౌదీ యువరాజు ఫైసల్ బిన్ సల్మాన్(Saudi Prince Faisal bin Salman) తనను వ్యక్తిగతంగా సంప్రదించారని దార్ వెల్లడించారు. “సౌదీ యువరాజు ఫైసల్ బిన్ సల్మాన్ నాకు ఫోన్ చేశారు. కాల్పుల విర‌మ‌ణ గురించి భార‌త్‌తో మాట్లాడాలా? అని అడిగారు. దీంతో నేను మాకు సాయం చేయాల‌న‌ని కోరాను. అనంత‌రం ఫైస‌ల్ మ‌ళ్లీ ఫోన్ చేసి భార‌త విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడాన‌ని, కాల్ప‌లు విర‌మ‌ణకు భార‌త్ సానుకూలంగా ఉంద‌ని ఆయ‌న తెలిపారు. దీంతో రెండు దేశాల మ‌ధ్య హాట్‌లైన్‌లో చ‌ర్చ‌లు జ‌రిగి కాల్పుల విర‌మ‌ణ‌కు దారి తీసింద‌ని” దార్ తెలిపారు.

    More like this

    Cross Voting | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపైనే అనుమానం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cross Voting | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధకృష్ణన్ ఘన...

    Weather Updates | పలు జిల్లాలకు నేడు వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం పడే అవకాశం ఉందని...

    Sriram Sagar | ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్ (SRSP)​లోకి ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది....