ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిCDC Chairman | సీడీసీ ఛైర్మన్ రాజీనామా ఉపసంహరణ.. పార్టీ నేతల బుజ్జగింపులే కారణమా..!

    CDC Chairman | సీడీసీ ఛైర్మన్ రాజీనామా ఉపసంహరణ.. పార్టీ నేతల బుజ్జగింపులే కారణమా..!

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: CDC Chairman | ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపిన సీడీసీ ఛైర్మన్ ఇర్షాదొద్దీన్ (CDC Chairman Irshaduddin)​ రాజీనామా అంశం రాత్రికి రాత్రే సద్దుమణిగింది. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు (MLA Madan Mohan Rao) పీఏల ఆగడాలు శ్రుతిమించుతున్నాయని.. ఆత్మగౌరవాన్ని చంపుకుని పార్టీలో కొనసాగలేక రాజీనామా చేస్తున్నట్లు గురువారం ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్ (TPCC Chief Bomma Mahesh Kumar Goud)​, డీసీసీ అధ్యక్షుడి కైలాస్​ శ్రీనివాస్​ (DCC President Kailash Srinivas) కూడా లేఖ రాశారు.

    CDC Chairman | రాజీనామాతో పార్టీలో దుమారం..

    అయితే రాజీనామా అంశం పార్టీలో తీవ్ర దుమారం రేపింది. ముఖ్య నాయకుడు పార్టీ నుంచి వైదొలిగితే తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముందని భావించిన ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. ఛైర్మన్​తో మాట్లాడి బుజ్జగించినట్లు సమాచారం. దాంతో ఆయన తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఇర్షాదొద్దీన్​ను ‘అక్షరటుడే’ సంప్రదించగా తాను రాజీనామా ఉపసంహరించుకుంటున్న విషయం నిజమేనన్నారు. తనకు ఎమ్మెల్యేపై ఎలాంటి కోపం లేదని మరోసారి స్పష్టం చేశారు. పీఏల వైఖరి నచ్చకే రాజీనామాకు సిద్ధమైనట్టు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు.

    CDC Chairman | కష్టపడ్డ వారికి న్యాయం జరగట్లేదని..

    ఎల్లారెడ్డి నియోజకవర్గంలో (YellaReddy Constituency) కష్టపడ్డ ఏ నాయకునికి ఎలాంటి గౌరవం లేదని గురువారం తాను విడుదల చేసిన రాజీనామా పత్రంలో ఇర్షాదొద్దీన్​ పేర్కొన్నారు. ఏ కార్యక్రమం జరిగినా మండల ప్రెసిడెంట్లకు గాని వివిధ హోదాలో ఉన్న నాయకులకు గాని ఎలాంటి సమాచారం ఉండదని వాపోయాడు. వివిధ మండలాల్లో ఉన్న అధికారులకు పీఏలు ఫోన్లు చేసి ఏ నాయకుడు వచ్చినా ఏ కార్యకర్త వచ్చినా తాము చెప్పేవరకు పని చేయవద్దని చెప్పడం జరిగిందని ఆయన లేఖలో వివరించారు. కానీ శనివారం ఆయన తన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...