Homeజిల్లాలుకామారెడ్డిCMRF Check | సీఎంఆర్ఎఫ్ చెక్కును చించేసిన సీడీసీ ఛైర్మన్

CMRF Check | సీఎంఆర్ఎఫ్ చెక్కును చించేసిన సీడీసీ ఛైర్మన్

సదాశివనగర్ సీడీసీ ఛైర్మన్ ఇర్షాదొద్దీన్ మరోసారి వార్తల్లో నిలిచారు. తమ కుటుంబానికి మంజూరైన సీఎంఆర్ఎఫ్​ చెక్కును చించివేశారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి : CMRF Check | ఎమ్మెల్యే పీఏల తీరుతో రాజీనామా చేసిన సదాశివనగర్ సీడీసీ ఛైర్మన్ ఇర్షాదొద్దీన్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన సోదరికి సంబంధించిన సీఎం సహాయ నిధి చెక్కును (CM Relief Fund Cheque) చించివేసి తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.

వివరాల్లోకి వెళ్తే.. ఇర్షాదుద్దీన్ చెల్లెలు నేహా బేగం 2024లో రోడ్డు ప్రమాదం జరగగా.. తలకు బలమైన గాయమై దీర్ఘకాలంగా చికిత్స పొందుతూ మృతి చెందింది. చికిత్సకు రూ.32 లక్షలు ఖర్చు కావడంతో సీడీసీ ఛైర్మన్​ ఇర్షాదొద్దీన్​ (CDC Chairman Irshaduddin) సీఎంఆర్ఎఫ్​కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ కుటుంబానికి కేవలం రూ.60 వేలు మాత్రమే రావడంతో ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.32 లక్షలకు దరఖాస్తు చేస్తే కేవలం రూ.60 వేలు రావడంతో ఆ చెక్కు తమకు అవసరం లేదని పేర్కొంటూ శుక్రవారం చెక్కును చించేసి తన ఆవేదనను వెళ్లగక్కారు. ఇలా ఛైర్మన్​ స్థాయి వ్యక్తి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు చించేయడం ప్రస్తుతం కామారెడ్డి (Kamareddy)లో హాట్​టాపిక్​గా మారింది.

Must Read
Related News