అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | అమ్మాయికి అబార్షన్ చేసిన ఘటనలో కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి (Private Hospital) తప్పించుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఆస్పత్రి యాజమాన్యానికి షోకాజ్ నోటీసు (Showcause Notice)ఇవ్వగా పొంతన లేని సమాధానాలు చెప్పారు.
Kamareddy | ఏకంగా సీసీ ఫుటేజీ మాయం..
తమపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఓ ఆస్పత్రి యాజమాన్యం ఏకంగా సీసీ ఫుటేజీ (CCTV Footage) డిలీట్ చేసింది. జిల్లా వైద్యశాఖ నిర్లక్ష్యాన్ని వేలెత్తి చూపిన అబార్షన్ ఘటనపై ఇటు పోలీసులు, అటు వైద్యాధికారులు విచారణ చేపట్టగా ఆస్పత్రి యాజమాన్యం దొరక్కుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
తాడ్వాయి మండలం (Tadwai Mandal)లోని ఓ గ్రామానికి చెందిన పెళ్లికాని అమ్మాయి గర్భం దాల్చగా ఆ యువతికి అబార్షన్ చేసిన ఘటనను ‘అక్షరటుడే’ (Akshara Today) వెలుగులోకి తీసుకువచ్చింది. విచారణలో భాగంగా ఆస్పత్రి, స్కానింగ్ సెంటర్లకు నోటీసులు జారీ చేశారు. అధికారుల నోటీసులకు ఆస్పత్రి నిర్వాహకులు పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
Kamareddy | సహకరించని ఆస్పత్రి యాజమాన్యం..
ఆస్పత్రికి విచారణకు వెళ్లిన అధికారులకు ఆస్పత్రి యాజమాన్యం సహకరించకపోగా ఆస్పత్రి రికార్డుల్లో కూడా ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా చేశారు. అబార్షన్ చేసిన రోజు సదరు అమ్మాయి ఆస్పత్రికి వచ్చిన సమయం నుంచి వెళ్లిపోయే వరకు సీసీ ఫుటేజీని, ఆస్పత్రి బయట ఉన్న దుకాణాల సీసీ ఫుటేజ్ కూడా డిలీట్ చేసినట్టుగా సమాచారం. దాంతో వైద్యాధికారులకు ఈ ఘటనలో ఎలాంటి ఆధారాలు లేక విచారణలో ముందుకు వెళ్లలేకపోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక పోలీసు శాఖ (Police Department) తనదైన శైలిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.