254
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CCS Team | పేకాట స్థావరంపై సీసీఎస్ టీం (CCS team) మెరుపుదాడులు చేసింది. ఈ సందర్భంగా పలువురిని అదుపులోకి తీసుకుంది. సీసీఎస్ ఏసీపీ ఇన్ఛార్జి మస్తాన్ అలీ ఆదేశాల మేరకు.. నవీపేట్ పోలీస్స్టేషన్ (Naveepet police station) పరిధిలోని అల్జాపూర్ శివారులో పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారంతో సీసీఎస్ టీం దాడులు చేసింది.
CCS Team | 12మంది పోలీసుల అదుపులో..
ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పది సెల్ఫోన్లు, రూ.31,410 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు నిమిత్తం నవీపేట్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. దాడుల్లో ఎస్సైలు గోవింద్, మహేష్, సిబ్బంది పాల్గొన్నారు.