అక్షరటుడే, ఇందూరు: CCS constables | నిజామాబాద్ (Nizamabad) లోని సీసీఎస్ కానిస్టేబుళ్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. సుభాష్ అనే కానిస్టేబుల్ సిరికొండకు బదిలీ అయ్యారు. నీలేష్‌ను బోధన్‌కు బదిలీ చేశారు.
కాగా, సీసీఎస్ కానిస్టేబుళ్లను అకస్మాతుగా బదిలీ ఎందుకు చేశారనే విషయం తెలియరాలేదు. ఇటీవలే పాత నేరస్థుడి చేతిలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ దారుణంగా హత్య గావించబడ్డారు.
CCS constables | ప్రక్షాళనలో భాగంగా..
ఈ హత్య తర్వాత సీసీఎస్‌ను పూర్తిగా ప్రక్షాళన చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే కానిస్టేబుళ్లను బదిలీ transfer చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు.
