అక్షరటుడే, బాన్సువాడ: Banswada | పట్టణంలోని పలు కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సబ్ కలెక్టర్ కిరణ్మయి (Sub-Collector Kiranmayi), మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజుకు (Municipal Commissioner Srihari Raju) వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. పాత అంగడిబజార్, ఇస్లాంపుర కాలనీ, గౌలిగూడ కుమ్మరిగల్లీ, పాత బాన్సువాడతో (Old Banswada) పాటు కొన్ని కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు అధ్వానంగా మారాయన్నారు. వర్షాల వల్ల రోడ్ల గుంతలు బురదమయంగా మారి, ప్రజలు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్పష్టం చేశారు. వాహనాలు చెడిపోవడం, ప్రమాదాలు జరిగే పరిస్థితి నెలకొందని తెలిపారు.
మున్సిపల్ అధికారులు సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలని కోరారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, సాయిబాబా, బోడ రాంచందర్, రమేష్ యాదవ్, ఇషాక్, చాకలి సాయిలు, నాగనాథ్ ఉబేద్, అఫ్జల్, లతీఫ్, మొకీమ్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేస్తున్న బీఆర్ఎస్ నాయకులు