- Advertisement -
HomeUncategorizedCbse results | సీబీఎస్​ఈ టెన్త్​ ఫలితాలు విడుదల

Cbse results | సీబీఎస్​ఈ టెన్త్​ ఫలితాలు విడుదల

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Cbse results | సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాలు ఉదయం విడుదల కాగా.. కొద్దిసేపటి క్రితం టెన్త్​ రిజల్ట్స్​ రిలీజ్​ అయ్యాయి. ఫలితాల్లో మొత్తం ఉత్తీర్ణత శాతం 93.66గా నమోదైంది. 2024లో 93.60 శాతం కాగా.. తాజా ఉత్తీర్ణత శాతం స్వల్పంగా పెరిగింది. మొత్తం 23,71,939 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా.. 22,21,636 మంది ఉత్తీర్ణులయ్యారు.

పరీక్షలు దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 15 నుంచి మార్చి 18 వరకు 7,837 సెంటర్లలో నిర్వహించారు. కాగా ఈ ఫలితాలను ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్లు cbse.gov.in, cbseresults.nic.in, results.cbse.nic.in ద్వారా చెక్ చేయవచ్చు. రోల్‌ నంబర్‌, పుట్టిన తేదీ, స్కూల్‌ నంబర్‌, అడ్మిట్‌ కార్డు నంబర్‌ ఎంటర్‌ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా డిజీలాకర్‌, ఉమాంగ్‌ యాప్‌ల ద్వారా కూడా రిజల్ట్స్‌ చూసుకోవచ్చు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News