HomeUncategorizedTollywood Industry | చంద్ర‌బాబుతో టాలీవుడ్ ప్ర‌ముఖుల మీటింగ్ క్యాన్సిల్.. కార‌ణం ఏంటంటే..!

Tollywood Industry | చంద్ర‌బాబుతో టాలీవుడ్ ప్ర‌ముఖుల మీటింగ్ క్యాన్సిల్.. కార‌ణం ఏంటంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tollywood Industry | సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యలతో పాటు ఇటీవల టాలీవుడ్ లో నెలకొన్న పరిణామాలపై ముఖ్యమంత్రితో చ‌ర్చించేందుకు ఇండస్ట్రీ ప్రముఖులు ఈ రోజు అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో షూటింగ్ చేసుకునేందుకు కావాల్సిన అనుమతులు, లొకేషన్ విషయం, పన్నుల విధానం తదితర అంశాలపై సీఎం(CM Chandrababu Naidu)తో ఇండస్ట్రీ పెద్దలు చర్చించాలాని అనుకున్నారు. కానీ చివ‌రి నిమిషంలో మీటింగ్ వాయిదా ప‌డింది. ఈ నెల 15న ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పుడు ఈ సమావేశం వాయిదా పడింది. సినిమాల షూటింగ్‌లు, ఇతర కారణాలతో పలువును సినీ పెద్దలు ఇతర ప్రాంతాల్లో ఉంటంతో ఈ భేటీ వాయిదా పడినట్లుగా వార్తలు వస్తున్నాయి.

Tollywood Industry | మ‌ళ్లీ వాయిదా..

దీంతో త్వరలోనే మరో రోజున సినీ పెద్దలంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసే సూచనలు కనిపిస్తున్నాయి. నేడు మొదట పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ని కలిసి అనంతరం పవన్ తో కలిసి సీఎం చంద్రబాబు దగ్గరికి టాలీవుడ్ ప్రముఖులు వెళ్లాలి. సీఎం, డిప్యూటీ సీఎంలను కలిసే లిస్ట్ లో డైరెక్టర్ లు బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, నాగ్ అశ్విన్, నిర్మాతలు అశ్వినీ దత్, దిల్ రాజు, అల్లు అరవింద్, దానయ్య, కేవీ రామారావు, హీరోలు.. బాలకృష్ణ, వెంకటేష్, మనోజ్, సుమన్, ఆర్.నారాయణమూర్తి, నాని.. ఇలా దాదాపు 35 నుంచి 40 మంది ఉన్నారు. నేడు సాయంత్రం సీఎం చంద్రబాబును 4 గంటలకు కలవాల్సి ఉంది.

మీటింగ్ కి రావాల్సిన సినిమా రంగంలోని పలు విభాగాల్లోని ముఖ్యమైన వారు కూడా అందుబాటులో లేకపోవడంతో మీటింగ్ రద్దు అయినట్టు తెలుస్తుంది. సీఎం, డిప్యూటీ సీఎం ప్రభుత్వం తరపున పిలిచినా టాలీవుడ్ ప్రముఖులు(Tollywood celebrities) అందుబాటులో లేకపోవడంతో మరింత చర్చగా మారింది. మళ్ళీ ఈ మీటింగ్ ఎప్పుడు జరుగుతుందో చూడాలి. ఇక ఈ మీటింగ్ వాయిదా పడటంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మంత్రి కందుల దుర్గేష్ సమావేశం కూడా వాయిదా పడినట్టు సమాచారం. కాగా, గ‌త రాత్రి హైద‌రాబాద్‌లో జ‌రిగిన గ‌ద్ద‌ర్ అవార్డ్స్(Gaddar awards) వేడుకలో చాలా మంది సినీ ప్ర‌ముఖులు పాల్గొని సంద‌డి చేశారు.