HomeUncategorizedCBI Raids | అనిల్ అంబానీ సంస్థ‌ల్లో సీబీఐ సోదాలు.. బ్యాంకులను మోస‌గించిన కేసులో త‌నిఖీలు

CBI Raids | అనిల్ అంబానీ సంస్థ‌ల్లో సీబీఐ సోదాలు.. బ్యాంకులను మోస‌గించిన కేసులో త‌నిఖీలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : CBI Raids | బ్యాంకుల‌ను మోస‌గించిన కేసులో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (సీబీఐ) దూకుడు పెంచింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (Reliance Communications), ఆ సంస్థ మాజీ ప్రమోటర్ అనిల్ అంబానీ(Anil Ambani)కి సంబంధించిన కార్యాల‌యాల్లో శ‌నివారం త‌నిఖీలు చేప‌ట్టింది.

త‌ప్పుడు ప‌త్రాల‌తో బ్యాంకుల నుంచి రూ. 17,000 కోట్లకు రుణాలు తీసుకుని ఎగ‌వేశార‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్(Enforcement Director) ఇప్ప‌టికే రంగంలోకి దిగింది. ఆగస్టు 5న అనిల్ అంబానీని దాదాపు 10 గంటల పాటు ప్రశ్నించింది. ఈ వ్య‌వ‌హారంపై ఎఫ్ ఐఆర్ న‌మోదు చేసిన సీబీఐ తాజాగా ముంబైలోని ప‌లు ప్రాంతాల్లో దాడులు చేసింది.

త‌ప్పుడు ప‌త్రాల‌తో రూ. 2,000 కోట్లకు పైగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank of India) కు నష్టం కలిగించార‌నే ఆరోప‌ణ‌ల‌పై న‌మోదైన మోసం కేసులో రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ సంస్థ ప్రమోటర్ డైరెక్టర్ అనిల్ అంబానీకి సంబంధించిన ప్రాంగణాల్లో సీబీఐ త‌నిఖీలు(CBI Raids) చేసింది. అతని గ్రూప్ కంపెనీలపై కోట్లాది రూపాయల విలువైన బహుళ బ్యాంకు రుణ మోసం కేసులకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అనిల్‌ను ప్రశ్నించిన రోజుల వ్య‌వ‌ధిలోనే ఈ సోదాలు జ‌రుగ‌డం గ‌మ‌నార్హం.