HomeUncategorizedCBI Director | ప్రధాని మోదీతో రాహుల్‌గాంధీ, సీజేఐ భేటీ

CBI Director | ప్రధాని మోదీతో రాహుల్‌గాంధీ, సీజేఐ భేటీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CBI Director | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ pm modi సోమవారం ఆయన కార్యాలయంలో లోక్​సభ ప్రతిపక్ష నేత LOP రాహుల్​గాంధీ rahul gandhi, భారత ప్రధాన న్యాయమూర్తి  CJI సంజీవ్​ ఖన్నా Sanjeev Khanna తో భేటీ అయ్యారు. సీబీఐ డైరెక్టర్‌ CBI Director ఎంపికపై వారు చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్​గా కర్ణాటక బ్యాచ్​కు చెందిన ప్రవీణ్​ సూద్​​ praveen sood పనిచేస్తున్నారు. ఆయన పదవీ కాలం మే 25తో ముగియనుంది. ప్రవీణ్​​ 2023 మే 25న బాధ్యతలు స్వీకరించారు.

నూతన సీబీఐ డైరెక్టర్​ను ప్రధాని, లోక్​సభ ప్రతిపక్ష నేత, ప్రధాన న్యాయమూర్తి కమిటీ ఎంపిక చేస్తోంది. ఈ క్రమంలో వీరు భేటీ అయ్యారు. సెంట్రల్​ విజిలెన్​ కమిషన్ యాక్ట్​ ప్రకారం సీబీఐ డైరెక్టర్​కు ఎంపికైన వారు కనీసం రెండేళ్లు ఆ పదవిలో పని చేయాలి. పదవీ కాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగించే అధికారం ప్రభుత్వానికి ఉంది.

Must Read
Related News