ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Obulapuram mining case | ఓబుళాపురం మైనింగ్ కేసు.. సీబీఐ కోర్టు సంచలన తీర్పు

    Obulapuram mining case | ఓబుళాపురం మైనింగ్ కేసు.. సీబీఐ కోర్టు సంచలన తీర్పు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఓబుళాపురం మైనింగ్‌ కేసులో obulapuram mining case సీబీఐ కోర్టు cbi court hyderabad సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో అయిదుగురు నిందితులకు శిక్ష ఖరారు చేసింది.

    ఈ కేసులో మంగళవారం కోర్టు తుది తీర్పు చెప్పింది. ఏ1 B.V. శ్రీనివాస రెడ్డి, ఏ2: గాలి జనార్దన్ రెడ్డి gali janardhan reddy, ఏ3 V.D. రాజగోపాల్, ఏ4 ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, A7 అలీ ఖాన్​లకు న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. ఇక ఇదే కేసులో నిందితురాలైన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో sabita indra reddy పాటు కృపానందంను నిర్దోషులుగా తేల్చింది.

    Obulapuram mining case | సంచలనం సృష్టించిన కేసు

    ఓబుళాపురం మైనింగ్ కేసు గతంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఓఎంసీ ఆక్రమణలు, అక్రమ మైనింగ్‌పై 2009లో నాటి ఏపీ గవర్నమెంట్​ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. 2007 జూన్‌ 18న అనంతపురం జిల్లా ఓబుళాపురం వద్ద 95 హెక్టార్లలో గాలి జనార్దన్‌రెడ్డి కంపెనీకి గత ప్రభుత్వం ఇనుప ఖనిజం గనుల లీజులు కట్టబెట్టింది.

    అయితే, ఇనుక ఖనిజం తవ్వకాలు, రవాణా-అమ్మకాల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో 2009 డిసెంబర్‌ 7న సీబీఐ కేసు ఫైల్​ చేసింది. గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివాస్‌రెడ్డితో పాటు అప్పటి గనులశాఖ మంత్రి అయిన సబితా ఇంద్రారెడ్డి, అధికారులు కృపానందం తదితరులపై అభియోగాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఈ కేసులో సీబీఐ కోర్టు తీర్పు చెప్పింది.

    More like this

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవల్లో కీలక మార్పులు రానున్నాయి....

    Sharper Mind | మతిమరుపుతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే పాదరసంలాంటి మెదడు మీసొంతం

    అక్షరటుడే, హైదరాబాద్ : Sharper Mind | మారుతున్న జీవనశైలి, ఒత్తిడితో కూడిన పనుల వల్ల చాలా మంది...

    Collectorate building collapses | ఆదిలాబాద్​లో భారీ వ‌ర్షం.. కుప్ప‌కూలిన క‌లెక్ట‌రేట్ భ‌వ‌నం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Collectorate building collapses : ఆదిలాబాద్​ Adilabad లో భారీ వర్షం దంచికొడుతోంది. గురువారం (సెప్టెంబరు...